రామ్ తో ‘డ్యుయెల్ రోల్’ ప్లాన్ చేస్తున్న బోయపాటి ?

Published on Feb 7, 2022 11:00 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – హీరో రామ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడని, ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చుట్టూ ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో లేటెస్ట్ గా ఓ అదిరిపోయే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :