పూరితో గొడవ పై స్పందించిన వర్మ !

Published on Dec 5, 2018 10:47 pm IST

రామ్ గోపాల్ వర్మను పూరి జగన్నాథ్ తన గురువుగా భావిస్తాడు. వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన పూరి, ఇప్పటికి కూడా వర్మతో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. అటు వర్మ కూడా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పూరి ఆదిత్యం తీసుకుకోకుండా ముంబై వెళ్ళడు.

అలాంటిది వీరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయని ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడంలో వర్మ పాత్ర ఉండటంతో.. అప్పటినుంచి వీరి స్నేహం చెడిందని, దాంతో ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదని గతకొంత కాలంగా సోషల్ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు పై వర్మ స్పందించారు.

వర్మ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తను ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటామని.. వాస్తవానికి గతంలో కంటే కూడా, ఇప్పుడే మేము ఎక్కువ స్నేహంగా ఉంటున్నామని వర్మ స్పష్టం చేసాడు.

సంబంధిత సమాచారం :