ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – ఈ సినిమా నాకు, మా యూనిట్ కి మంచి బ్రేక్ ఇస్తోంది.

ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – ఈ సినిమా నాకు, మా యూనిట్ కి మంచి బ్రేక్ ఇస్తోంది.

Published on Nov 26, 2018 3:41 PM IST

నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రం నవంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

భైరవగీత’ చిత్రం గురించి చెప్పండి ?

ఈ చిత్రం నాకు మరియు మా భైరవగీత’ యూనిట్ కి మంచి బ్రేక్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. మా దర్శకుడు సిద్ధార్థ్ ఈ చిత్ర కథ నాకు చెప్పినప్పుడు, అంతే విభిన్నంగా తెరకెక్కించినప్పుడు నేనెంత కొత్తగా ఫీల్ అయ్యానో రేపు సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అవుతారు.

మీరు భైరవగీత విభిన్నంగా తెరకెక్కిందని కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. కానీ చిత్రం ప్రోమోస్ చూస్తుంటే ఆర్జీవీ దర్శకత్వ శైలినే ఎక్కువుగా కనిపిస్తోంది. దీని గురించి ఏం చెబుతారు ?

సినీ దర్శకులు అందరూ వారి వారి అభిరుచులకు తగ్గట్లు ఎక్కువుగా ఎవరో ఒకరి చేత చేత ప్రభావితం అవుతుంటారు, లేదా ప్రేరణ పొందుతుంటారు. అదే విధంగా, భైరవగీత దర్శకుడు సిద్దార్థ్ కూడా నా దర్శకత్వ శైలికి ప్రభావితం అయ్యాడేమో అనిపిస్తోంది. అందుకే అతని కట్ చేసిన ప్రోమోస్ కూడా నా శైలికి దగ్గరగా ఉన్నాయి. కానీ ఈ భైరవగీత చిత్రం మాత్రం పూర్తిగా తన స్టైల్ లోనే ఉంటుంది.

‘భైరవగీత’లో ప్రేక్షకులను ఆకర్షించగల అంశాలు ప్రధానంగా ఏమి ఉన్నాయి ?

‘భైరవగీత’లో ఆకర్షించగల అంశాలు అంటే.. సినిమాలోని కోర్ ఎమోషన్ బాగా ఆకట్టుకుందని చెప్పగలను. బాగా డబ్బు ఉన్న అమ్మాయి మరియు ఓ పేద కుర్రాడి మధ్య ప్రేమే ఈ సినిమా కథ. వారి ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమాలో మేం ప్రధానంగా సమాజంలోని వివిధ సాంఘిక అసమానతలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అయితే చేశాము.

మీ సినిమాల్లో చాలా మందిని కొత్త నటులనే తీసుకోవటానికి గల కారణం ఏమిటి ?

కొత్త నటులు అయితే స్పష్టంగా నా ఆలోచనలను తెలియజేయగలను, నాకు నచ్చినట్లు వారి నుండి సహజమైన నటనను రాబట్టుకోగలను. అన్నిటికిమించి నాకు వారితో ప్రొఫెషనల్ ఆబ్లికేషన్స్ లాంటివేం ఉండవు.

మీరు ఎంతో నమ్మి చేసిన ‘ఆఫీసర్’ వైఫల్యం నుండి మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారా ?

నేను ఏం పాఠాలు నేర్చుకోలేదు. ఆ సినిమా అంత దారుణంగా ఫెయిల్ అవుతుందని మేం ఎప్పుడూ ఊహించలేదు. నేను, నాగ్ ఇద్దరం ఆ కథను నమ్మాము. అందుకే ఆ సినిమా చేశాం. అంత తెలుసు అని నమ్మకం ఉన్నప్పుడు, నేర్చుకోవాలనే ఆసక్తి ఉండదు కదా.

మీరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా షూట్ ను ప్రారంభించారా?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ జరగబోతోంది. ఆ సినిమా పై చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి. వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. నేను ఆ సినిమాలో అందరికీ తెలిసిన అంశాలనే ప్రస్తావిస్తున్నాను, చూపిస్తున్నాను. కొత్తగా ఏం చూపించను. అందరికి తెలిసిన అంశాలనే చెబుతున్నప్పుడు ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది ?. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఫిబ్రవరి నెలలో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు