మహేష్ కోసమే మహర్షిని చూశారంటున్నవర్మ

Published on May 27, 2019 8:30 pm IST

మహేష్ సిల్వర్ జూబ్లీ మూవీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన “మహర్షి” సక్సస్ ఫుల్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం పై తొలిసారిగా స్పందించారు.

తాను సామజిక అంశాలు, రైతుల సమస్యలు వంటి సందేశాత్మక సినిమాలు తీయడానికి ఇష్టపడనన్నారు.రైతుల సమస్యలను ఉద్దేశించి మహేష్ చేసిన “మహర్షి” లాంటి మూవీని నిజానికి ఎవరు చూడరన్నారు. కేవలం మహేష్ ఉన్నాడనే ఆ మూవీ విజయం సాధించిందని , మహేష్ లేక పొతే ఆ మూవీ ఎవరు చూసే వారుకాదని,తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. కేవలం వినోదం, పాటల కోసం మూవీ చుసిన ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకి వచ్చాక మూవీ లో సందేశం బాగుందని చెవుతున్నారని ఎద్దేవా చేశాడు.

సంబంధిత సమాచారం :

More