వైల్డ్ లుక్ లో మతిపోగెట్టేలా ఇస్మార్ట్ రామ్

Published on Aug 10, 2019 11:32 am IST

హీరో రామ్ పోతినేని కొద్దిసేపటి క్రితం తన నయా లుక్ రివీల్ చేస్తూ ఓ షాకింగ్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఓ భిన్నమైన షర్ట్ ధరించి, ప్రెంచ్ గడ్డంలో గుండు చేయించుకొని ఉన్న రామ్ ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చి అందరిని విస్మయానికి గురిచేశారు. మైల్డ్ లీ వైల్డ్, వైల్డ్ లీ మైల్డ్ అనే ఓ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఆ ఫోటోకి ట్యాగ్ చేశారు.

ఇస్మార్ట్ శంకర్ విడుదల తరువాత రామ్ కుటుంబంతో కలిసి విదేశీ టూర్ కి వెళ్లడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ట్రిప్ ముగించుకొచ్చిన రామ్ ఏ వేడుకలో చూసినా క్యాప్ తో కనిపించారు. ఆయన ఎప్పుడూ క్యాప్ పెట్టుకొని ఉండటం వెనుక గల అసలు కారణాన్ని నేడు ఈ ఫోటో ద్వారా రివీల్ చేశారు రామ్. ఐతే ఈ నయా లుక్ రామ్ చేయబోయే తదుపరి చిత్రం కొరకా,లేక సరదాగా అలా ట్రై చేశారో చెప్పాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :