“ఇస్మార్ట్ శంకర్” సెలెబ్రేషన్స్ కి కళ తెచ్చాడబ్బా…!

Published on Aug 1, 2019 2:28 pm IST

పూరీజగన్నాధ్,ఛార్మి,నిధి అగర్వాల్,నభా నటేష్ లతో కూడిన “ఇస్మార్ట్ శంకర్” బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ విజయోత్సవాలు ఫ్యాన్స్ తో కలిసి జరుపుకుంటున్నారు. ఐతే ఈ సెలెబ్రేషన్స్ లో అసలు అట్రాక్టన్ హీరో రామ్ లేకపోవడం అతి పెద్ద లోటు అనిచెప్పాలి. హీరో రామ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం మూవీ విడుదలైన వెంటనే కుటంబంతో కలిసి విదేశీ టూర్ కి వెళ్లడంలో చిత్ర ప్రొమోషన్స్ తో పాటు, విజయోత్సవాలలో పాల్గొనలేకపోయారు.

“ఇస్మార్ట్ శంకర్” చిత్రం విడుదల తేదీ జులై 12 నుండి 18 కి మారడం ఈ సమస్యకు ప్రధాన కారణం. రామ్ లేకపోయినా ఛార్మి, పూరి హీరోయిన్ల సహాయంతో ప్రొమోషన్స్ చక్కగా నిర్వహించి మూవీకి మంచి ప్రచారం కల్పించడంలో విజయం సాధించారు. రామ్ విదేశీ టూర్ పూర్తి చేసుకొనిరావడంతో ఆయన నేడు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఈ విజయాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమాలలో విడుదల చేయడం జరిగింది.

కాగా “ఇస్మార్ట్ శంకర్” విడుదలై రెండు వారాలు దగ్గిరపడుతున్నా, మూవీ వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం విశేషం. చాలా ఏరియాలలో ఈ మూవీ అమ్మిన రేటుకి రెట్టింపు వసూళ్లు సాధించిందని సమాచారం.

సంబంధిత సమాచారం :