ఓటీటీలో నైనా రామ్ ‘ది వారియర్’ మెప్పిస్తుందా ?

ఓటీటీలో నైనా రామ్ ‘ది వారియర్’ మెప్పిస్తుందా ?

Published on Jul 31, 2022 9:34 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యంగ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన చిత్రం “ది వారియర్”. ఈ సినిమా ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయింది. అయినా ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే, త్వరలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇంతకీ ఈ సినిమా ఓటీటీలో ఎప్పటి నుంచి అలరించబోతుందో తెలుసా ? ఆగస్టు 11 నుంచి. అవును.. డిస్నీ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి ది వారియర్ స్ట్రీమింగ్ కానుంది. ఆది పినిశెట్టి నెగెటివ్ రోల్‌లో కనిపించిన ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ గా నటించాడు. రామ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరించాడు. మరి ఓటీటీలో నైనా ది వారియర్’ మెప్పిస్తాడా ? చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు