ఆ విషయంపై రామ్ ఫోకస్ పెంచాల్సిందే..!

ఆ విషయంపై రామ్ ఫోకస్ పెంచాల్సిందే..!

Published on Dec 12, 2025 8:05 AM IST

Ram-Pothineni

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థియేట్రికల్ రన్ ముగిసింది. మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ ఉన్నా సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మైత్రి మూవీస్ నిర్మాణం, మంచి కాస్ట్, సంగీతం అన్నీ ఉన్నా, ఈ సినిమా ప్రేక్షకులను పూర్తి్స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు మహేష్ కుమార్ పి చెప్పాలనుకున్న కథ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదని చెప్పాలి.

ఈ నేపథ్యంలో రామ్ కెరీర్‌పై మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోలు కూడా ఫ్లాపులు ఎదుర్కొన్నా వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యే స్థాయిలో ఉంటారు. కానీ రామ్ విషయంలో ప్రభావం ఎక్కువ. తనకు సూటయ్యే ఫ్యామిలీ, లవ్ జానర్‌ను వదిలి వరుసగా మాస్ సినిమాల్లో ప్రయోగాలు చేయడం అతనికి కలిసి రాలేదు.

ఇప్పుడు రామ్ దారి మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హారర్ కథలు, కొత్త దర్శకుల ఐడియాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సముద్రఖని చెప్పిన ఓ కథను కూడా ఆయన పరిశీలుస్తున్నాడట. త్వరలోనే ఆయన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ చేస్తాడని తెలుస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు