రామ్ “ది వారియర్” డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

Published on Jul 14, 2022 11:00 pm IST

రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం లో కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ పార్ట్ నర్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ అనంతరం స్టార్ మా లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :