ఇంటర్వ్యూ : రామ్ -‘హలో గురు’ ఫన్ తో కూడిన ఎమోషనల్ జర్నీ !

Published on Oct 16, 2018 12:33 pm IST

‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం తరువాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈచిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా రామ్ మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం..

ఈ సినిమాలో మీ రోల్ గురుంచి ?

ఈసినిమాలో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటించాను. విల్లెజ్ నుండి సిటీ కి వస్తాను. సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ఈ సినిమాలో ఉంటుంది. అందుకని ఈ చిత్రాన్ని చేశాను.

ఈసినిమాకు బాగా కష్టపడ్డట్టున్నారు ?

లేదండి . ఇప్పటిదాకా నేను చేసిన సినీమాల్లో నాకు ఇష్టమైన పాత్ర కూడా ఇదే. చాలా ఎంజాయి చేసుకుంటూ చేశాను. డైరెక్టర్ త్రినాథరావు అలాగే రచయిత ప్రసన్న కుమార్ వల్ల ఈ చిత్రం చాలా బాగా వచ్చింది.

ఈచిత్రంలో ప్రణీత పాత్ర గురించి ?

ప్రణీత ది ఒక గెస్ట్ రోల్ గా ఉంటది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ల ఆలా ఉండదు. ఈసినిమా ప్రధానంగా నాకు , అనుపమ , ప్రకాష్ రాజ్ మధ్యన ఉంటుంది. ఈ ముగ్గరిపాత్రలు సినిమాకు చాలా అవసరం.

దిల్ రాజు గురించి ?

సినిమా గురించి మాత్రమే ఆలోచించే నిర్మాత. సినిమాలను కరెక్ట్ గా అంచనా వేసే వ్వక్తి. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ తరువాత మరి కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది. సినిమా గురుంచి ప్రతి ఒక్కరి ఒపీనియన్ ను అడుగుతారు ఆయన.

అనుపమా పరమేశ్వన్ గురించి ?

ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం తరువాత మళ్ళీ ఈ చిత్రంలో కలిసి నటించాం. ఆసినిమాలో కెమిస్ట్రీ కి ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య వుండే కెమిస్ట్రీ చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. మా ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు ఎంటెర్టైన్గా ఉంటాయి.

పూరి జగన్నాధ్ గారితో సినిమా చేస్తున్నారని విన్నాం నిజమేనా ?

పూరి గారితో ఎప్పటినుండో కథా చర్చలు జరుగుతున్నాయి. ఎక్సయిట్మెంట్ స్టోరీ లైన్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్ని కుదిరితే ఆయనతో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :