రామ్ ‘ది వారియ‌ర్’ బుల్లెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

రామ్ ‘ది వారియ‌ర్’ బుల్లెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

Published on Apr 24, 2022 3:04 AM IST

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుద‌ల కానుంది.

అయితే ఈ చిత్రం నుంచి నిన్న ‘బుల్లెట్’ లిరిక‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. శ్రీ మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను త‌మిళ స్టార్ శింబు ఆలపించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే ఈ ఈ పాట‌ కోసం నిర్మాత‌లు దాదాపుగా రూ. 3 కోట్ల వరకు ఖ‌ర్చు పెటారని టాక్ వినిపిస్తుంది. ఈ పాటలో రామ్, కృతి శేట్టిల డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు