గ్రాండ్ గా రామ్ ‘ది వారియర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

Published on Jul 15, 2022 8:00 pm IST

యంగ్ హీరో రామ్, యువ భామ కృతి శెట్టి ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బైలింగువల్ మూవీ ది వారియర్. ఈ మాస్ యాక్షన్ కమర్షియయల్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి తెరకెక్కించారు. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ది వారియర్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ తో తమ మూవీ కొనసాగుతుండడంతో నేడు మూవీ యూనిట్ గ్రాండ్ గా కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ సెలెబ్రేషన్స్ లో హీరో రామ్, హీరోయిన్ కృతి, డైరెక్టర్ లింగుస్వామి, ఆదిపినిశెట్టి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. తమ మూవీకి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకి రామ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ లింగుస్వామి. తమ టీమ్ మొత్తం ఎంతో కష్టపడి వర్క్ చేసిన ది వారియర్ మూవీకి ప్రేక్షకులు అందిస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు హీరో రామ్.

సంబంధిత సమాచారం :