ఇస్మార్ట్ పూరి ప్రకటించేశారు, మరి రామ్?

Published on Aug 13, 2019 7:16 am IST

ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి శైలే వేరు. వర్మ శిష్యుడిగా ఆయన లక్షణాలు చాలానే పుణికిపుచ్చుకున్నాడు ఈయన. మూడు నెలల్లో స్టార్ హీరో సినిమా అయిన చుట్టేయగలడు, నెలరోజులలో స్క్రిప్ట్ సిద్ధం చేయగల మేధావి. ఆయన చిత్రాలు తీసినంత వేగంగా మరో డైరెక్టర్ తీయలేరంటే అతిశయక్తికాదు. జయాపజయాలను అటుంచితే ఆయన జెట్ వేగంతో సినిమాలు చేసి చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుంటారు.
ఇక ఆయన రామ్ హీరోగా తెరక్కెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం అందుకుంది. ఆ మూవీ సక్సెస్ మూడ్ లో ఉండగానే మరో చిత్రం ప్రకటించేశారు పూరి. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో చిత్రం చేస్తున్నట్లు నిన్న అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగిపోయింది. సాఫ్ట్ హీరోలనే తెరపై రఫ్ ఆటిట్యూడ్ తో ప్రెసెంట్ చేసే పూరి ఇక రౌడీ హీరోని తెరపై ఎలా చూపిస్తారో ఆలోచిస్తేనే మతిపోతుంది.

కాగా ఇస్మార్ శంకర్ రామ్ పరిస్థితి ఏమిటీ? ఆయన ఇంకా కొత్త చిత్రానికి సంబందించిన ఎటువంటి స్టెప్ తీసుకోలేదని తెలుస్తుంది. గతంలో రామ్ కి నేను శైలజ వంటి క్లాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల ఓ కథ వినిపించగా, రామ్ పెదవి విరిచారని సమాచారం. అలాగే ఇస్మార్ట్ శంకర్ చిత్రం వంటి ఊర మాస్ మూవీ తరువాత ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పాటు, ఈ విజయం తరువాత నుండైనా సినిమాల ఎంపికలో జాగ్త్రతగా ఉండాలని భావిస్తున్నారట.
ఐతే మూడు రోజుల క్రితం గుండు చేయించుకొని ఫ్రెంచ్ గడ్డం తో ఉన్న ఓ కొత్త అవతారంలో రామ్ కనిపించడం జరిగింది.మరి ఆ నయా లుక్ సినిమా కోసమా లేక మరేదైనా కారణం ఉందో తెలియాలి.

సంబంధిత సమాచారం :