లాలా భీమ్లా…ఫుల్ మీల్స్ – రామ జోగయ్య శాస్త్రి

లాలా భీమ్లా…ఫుల్ మీల్స్ – రామ జోగయ్య శాస్త్రి

Published on Nov 7, 2021 3:30 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు భీమ్లా నాయక్ నుండి లాలా భీమ్లా పాట ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాటకు త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ రాశారు. త్రివిక్రమ్ రాసిన లిరిక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వాట్ ఏ రైటింగ్ త్రివిక్రమ్ గారు అంటూ, పది పడగల పాము పైన పాడమేడితే సామి తోడు, పిడుగులోచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా… ఫుల్ మీల్స్ అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదిక గా రామ జోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి, నిత్యా మీనన్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు