నేనింత వరకూ రావడం లో మీ పాత్ర మరువలేనిది – రామజోగయ్య శాస్త్రి

Published on Apr 14, 2022 12:09 am IST

టాలీవుడ్ లో తన మాటలతో, పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రచయిత రామజోగయ్య శాస్త్రి గారు. ఎన్నో హిట్ సాంగ్స్ ను రాసిన రామజోగయ్య శాస్త్రి తాజాగా సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఢీ చిత్రం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామజోగయ్య శాస్త్రి స్పందించడం జరిగింది.

థాంక్యూ డియర్ శ్రీనువైట్ల గారు, నేనింత వరకూ రావడం లో మీ పాత్ర మరువలేనిది. తొలిరోజుల్లో ఒక ప్రతిభను గుర్తించడం, నమ్మడం మీరు నాకు చేసిన మేలు. ఢీ, నామట్టుకు నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. మన టీమ్ అందరికీ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. రామజోగయ్య శాస్త్రి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రచయిత గా కొనసాగుతున్నారు. మరిన్ని హిట్ సాంగ్స్ తో ఈ ఏడాది దూసుకు పోతున్నారు.

సంబంధిత సమాచారం :