చైతూ చాలా హ్యాండ్సమ్‌ గా ఉన్నాడట !

చైతూ చాలా హ్యాండ్సమ్‌ గా ఉన్నాడట !

Published on Oct 28, 2018 8:10 PM IST

Ramajogayya Sastry

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. కాగా తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ ఈవెంట్ లో నాగచైతన్య గురించి మాట్లాడలేకపోయిన రామజోగయ్య శాస్త్రి ట్వీటర్ ద్వారా తాను చెప్పాలనుకుంది చెప్పారు.

రామజోగయ్య శాస్త్రి పోస్ట్ చేస్తూ.. ‘నాగచైతన్య గురించి సవ్యసాచి ప్రీ రిలీజ్‌ వేడుకలో మాట్లాడటం కుదరలేదు. చైతు.. నువ్వు ఈ చిత్రంలో చాలా హ్యాండ్సమ్‌ గా కనిపిస్తున్నావు. ప్రధానంగా ఓ వ్యక్తిని నీ ఎడమ చేత్తో పైకి ఎత్తి కొడుతున్నప్పుడు ఇంకా చాలా బాగున్నావ్. డైరెక్టర్ చందూ మొండేటికి నా ధన్యవాదాలు. కంటెంట్‌ పరంగా ఈ చిత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు చాలా ఎక్కువగా ఉంది’ అని రామజోగయ్య పోస్ట్ చేశారు. అయితే రామజోగయ్య శాస్త్రి ట్వీట్ కి నాగచైతన్య స్పందిస్తూ..‘ధన్యవాదాలు సర్‌’ అని రిప్లే ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు. నవంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు