భీం టీజర్ – చరణుడి గర్జన..తారకుడి విశ్వరూపం..జక్కన అద్భుతం.!

Published on Oct 22, 2020 11:47 am IST

భారతీయ సినిమా ప్రేక్షకులు ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు రెండేళ్ల పాటు ఎదురు చూస్తున్న మాసివ్ క్షణం ఇప్పుడు వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రంలోని కొమరం భీం గా ఎన్టీఆర్ పై తీసిన మోస్ట్ అవైటెడ్ అండ్ పవర్ ఫుల్ టీజర్ ను RRR యూనిట్ విడుదల చేసేసింది. భారీ అంచనాలు నెలకొల్పుకొని కొమరం భీం 119వ జయంతి సందర్భంగా ఇప్పుడే విడుదలయ్యింది. ఈ టీజర్ పై మాత్రం అందరు పెట్టుకున్న అంచనాలను అబద్దం చేస్తూ అంతకు మించిన ఫీస్ట్ నే జక్కన అందించాడు.

మొదట చరణ్ పై ప్లాన్ చేసిన టీజర్ ప్యాట్రన్ లోనే చరణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయిన ఈ టీజర్ ఒక అద్భుతం అనే చెప్పాలి జక్కన చూపించిన విజువల్స్ వాటినే బీట్ చేసే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వరూపం ఒక కనుల పండుగ అని చెప్పాలి ముఖ్యంగా కొన్ని షాట్స్ భీం ఎదురుగా ఒక ఎగసిపడే ఒక అల, మెరుపుల నడుమ గొలుసులతో నిలబడి ఉన్న దృశ్యం, యుద్ధ సన్నివేశంలో భీం ఎగరవేసే జెండా, సూర్యుడికి మరో ప్రతిబింబంలా విరిసిన ఈటె, భీం కంటి నుంచి రక్తపు చుక్క పడితే జరిగే విస్ఫోటనం, ఆరుపలకల దేహంలో ఎన్టీఆర్ ఉగ్ర రూపం, చివరిగా అడవిలో చిరుత వేగాలతో ఈ టీజర్ ఒక అద్భుతం అంతే.

కీరవాణి సంగీతం మరియు టీజర్ లోని వి ఎఫ్ ఎక్స్ షాట్స్ అయితే మరో లెవెల్ అని చెప్పాలి. జస్ట్ టీజర్ లోనే ఇంత అత్యద్భుతంగా చెక్కిన రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై ఇచ్చే విజువల్ ట్రీట్ కు మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని చెప్పాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More