స్టార్ హీరోకి చుక్కలు చూపించిన రామ్ దేవ్.

Published on Aug 30, 2019 3:46 pm IST

భారత యోగా గురుగా చెప్పుకొనే బాబా రాందేవ్ గురించి తెలియని వారుండరు. భారత సాంప్రదాయంలో విశిష్టమైన యోగాకి ఆయన విశిష్ట ప్రచారం కల్పిచేందుకు కృషి చేస్తుంటారు.ఆయన ప్రస్తుతం పతంజలి పేరుతో అనేక ప్రకృతి సిద్ధంగా తయారుచేసిన, మానవ హిత వస్తువులను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. కాగా ఇటీవల ఓ సామజిక కార్యక్రమంలో ఆయన తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు.

ఐతే ఈ కార్యక్రమంలో బాబా తన ఆసనాలను అనుసరించాల్సిందిగా రణ్వీర్ అడిగారు. ఆ ఛాలెంజ్ తీసుకున్న రణ్వీర్ ఆయన చేసే ఆసనాలు, ఆ వేగాన్ని చూసి నివ్వెరపోయారు. చాలా వరకు ప్రయత్నించిన రణ్వీర్ కొంతసేపటి తరువాత చేయలేక చేతులెత్తేశారు. 53 ఏళ్ల బాబా స్పీడ్ ని అందుకోవడం యంగ్ హీరో తరం కాలేదంటే ఆయన ఫిట్నెస్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :