ప్రసాద్’ స్ మల్టీ ప్లెక్స్ లో సినిమా చూసి, ఆ తర్వాత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు లో షికారు కి వెళ్ళడం హైదరాబాద్ నగర ప్రజలకు అలవాటు. అయితే వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేది ఇదే అని చెప్పాలి. అయితే హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్’ స్ మల్టీప్లెక్స్ ఒకటి అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ ను అధునాతన హంగులతో సరికొత్తగా తీర్చి దిద్దారు. జూలై 30 నుండి స్క్రీన్లు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ రెండవ దశ తర్వాత థియేటర్ల లో విడుదలకు సిద్దం అయిన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్’ స్ మల్టీప్లెక్స్ సిద్దం అయింది.
అయితే ఈ నేపథ్యం లో ప్రసాద్’ స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాద్’ స్ మల్టీప్లెక్స్ రెన్నోవేశన్ పనులు పూర్తి అయ్యాయి అని వ్యాఖ్యానించారు. శుక్రవారం నుండి ప్రేక్షకులకు కొత్త స్క్రీను మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే తమ ఉద్దేశ్యం అని అన్నారు.అయితే కరోనా వల్ల సినీ పరిశ్రమకు, ప్రజలకు చాలా హాని జరిగిందని, ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దామని అన్నారు. తాము ఈ మల్టీప్లెక్స్ కట్టిన నాటి నుండి నేటివరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అని అన్నారు. ఆ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. రెన్నోవేషన్ కోసం భారీగా ఖర్చు అయినప్పటికీ, ప్రేక్షకుల కోసం సరికొత్తగా మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దామని అన్నారు. త్వరలో ఐమాక్స్ తెరను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. నాన్నగారు ఎల్వీ ప్రసాద్ సినిమానే జీవితంగా బతికారు, దేశంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారు, ఆయన పిల్లలుగా మేం సినీ పరిశ్రమకు ఎంత సేవ చేయాలో అంతా చేస్తున్నామని, సినీ రంగంలో ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు.


