రామ్ “రెడ్” కు మరోసారి భారీ ఆఫర్..?

Published on Jul 9, 2020 5:59 pm IST


మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కు మరియు పూరి జగన్నాథ్ కు ఒక అదిరిపోయే కం బ్యాక్ వచ్చినట్టు అయ్యింది. అంతే కాకుండా రామ్ కు కూడా మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది.

ఇదే ఊపులో రామ్ తన హ్యాట్రిక్ సినిమాల దర్శకుడు తిరుమల కిషోర్ తో “రెడ్” మరో మాస్ ఎంటర్టైనర్ ను మొదలు పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి మాస్ లో మరోసారి ఇంపాక్ట్ కలిగించాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ వలన అన్ని చిత్రాలతో పాటుగా ఈ చిత్రం కూడా ఆగిపోవాల్సి వచ్చింది.

దీనితో అనేక చిత్రాలు ఓటీటీ బాట పట్టగా, మరికొన్నిటికి భారీ ఆఫర్ లు వచ్చాయి. అలాగే ఈ చిత్రానికి కూడా గత కొన్నాళ్ల కితం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 20 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చింది అని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ మరో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దగ్గరగా 30 కోట్ల వరకు ఆఫర్ చేసారట.

అయినప్పటికీ మేకర్స్ ఈ చిత్రాన్ని అమ్మేందుకు ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఈ చిత్రంలో రామ్ సరసన హీరోయిన్ గా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More