పండగ చేస్కో లాంటి హిట్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ‘శివమ్’ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఆ సినిమా రామ్ కి బాక్స్ ఆఫీసు వద్ద చెడు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాతో బాగా అసంతృప్తికి లోనైన రామ్ ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు. అంతే కాకుండా తన తదుపరి సినిమా విషయంలో తనే దగ్గరుండి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
ఈ చిత్ర టీం నుంచి అందిన సమాచారం ప్రకారం రామ్ ఇప్పటి వరకూ 70% షూటింగ్ పూర్తయ్యింది. షూటింగ్ పూర్తైన రషెష్ ని రామ్ చూసాడు. కొన్ని సీన్స్ ఎందుకో సంతృప్తికరంగా అనిపించకపోవడంతో వాటిని రీ షూట్ చేద్దామని దర్శకుడు కిషోర్ తిరుమలకి సూచించినట్లు సమాచారం. కిషోర్ తిరుమల కూడా ఆ విషయంపై వర్కౌట్ చేస్తున్నాడు. రామ్ ఈ సారి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో హరికథ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తండ్రి – కుమార్తెల మధ్య ప్రేమాను బంధాలకి పెద్దపీట వేస్తూ చేసిన హరికథ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మాత.


