‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ పాత్ర అదేనా ?

Published on Sep 27, 2020 11:25 pm IST

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.

యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబందించి ఫ్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. కాగా ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌ లో రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ స‌న్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ ను చిత్రీకరిస్తున్నారట.

ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More