బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ స్థానంలో…?

Published on Aug 31, 2019 5:03 pm IST

ఈవారం బిగ్ బాస్ ప్రత్యేకత చాటుకోనుంది. ఎందుకంటే ఈ శనివారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ స్థానంలో ఒక సీనియర్ హీరోయిన్ రాబోతున్నారు. ఆమె ఎవరో కాదు మాహిష్మతి రాజ మాత దేవసేన. దేవసేన ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులను కలుసుకోనున్నారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు.

విషంలోకి వెళితే నాగార్జున ఈనెల 29న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కొరకు కుటుంబం తో కలిసి స్పెయిన్ వెళ్లారు. దీనితో ఈ వారం ఆయన హోస్ట్ చేయాల్సిన బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ షూటింగ్ లో పాల్గొనలేకపోయారు. దీనితో స్టార్ మా యాజమాన్యం ఈ వారానికి సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ను హోస్ట్ గా దించారు. తెరపై కంటి చూపుతోనే రాజసం, రౌద్రం చూపించే రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా ఎలా చేస్తారో చూడాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, బుల్లి తెరపై బిగ్ బాస్ లేడీ హోస్ట్ ని చూడడానికి సిద్దమైపోండి.

సంబంధిత సమాచారం :