సర్పట్టా ట్రైలర్ పై రానా దగ్గుపాటి ఏమన్నారంటే?

Published on Jul 16, 2021 8:06 pm IST

ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వం లో విడుదల కి సిద్దం గా ఉన్న చిత్రం సర్పట్ట. అయితే ఈ చిత్రం ట్రైలర్ తాజాగా తెలుగు లో విడుదల అయింది. అయితే ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు వారు సైతం ఎంతో ఆసక్తీ గా ఎదురు చూస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రం పై ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి స్పందించారు. సర్పట్ట ట్రైలర్ ఫెంటాస్టిక్ అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అని అన్నారు. అయితే ఈ చిత్రం యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా లో సైతం వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం జూలై 22 వ తేదీన అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :