సూపర్ స్టఫ్ అంటూ సత్యదేవ్ పై రానా ప్రశంసలు!

Published on Aug 16, 2021 12:31 pm IST

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు సత్యదేవ్. సత్యదేవ్ చేసిన హబీబ్ ఫుల్ సాంగ్ విడుదల అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అభిమానులు సైతం సత్యదేవ్ నటన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నటుడు భల్లాల దేవ రానా దగ్గుపాటి ఈ వీడియో పై స్పందించారు. చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల పట్ల సత్యదేవ్ స్పందించారు. కెప్టెన్ చాలా థాంక్స్ అని అన్నారు. మీ పోస్ట్ చూస్తున్నందుకు టీమ్ చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. సత్యదేవ్ చేసిన ఈ హబీబ్ పాటకి దర్శకత్వం జెన్నిఫర్ అల్ఫాన్స్ అందించారు. సంగీతం జయ ఫని కృష్ణ అందించారు.

సంబంధిత సమాచారం :