చరణ్ ప్లేస్ లో రాణా?

Published on Jul 15, 2020 2:07 am IST


కొరటాల మరియు చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య మూవీ తెరకెక్కుతుండగా ఆ మూవీలో ఓ కీలక రోల్ పై అనేక పుకార్లు తెరపైకి రావడం జరిగింది. అరగంట నిడివి గల ఓ కీలక రోల్ కోసం మహేష్ బాబుని తీసుకున్నారని, దాని కోసం మహేష్ కి 30కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు దర్శకుడు కొరటాల స్పష్టత ఇచ్చారు. ఐతే రామ్ చరణ్ నటిస్తున్న మాట వాస్తవం అని తేల్చడం జరిగింది.

కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడడంతో ఆచార్య మూవీలో చరణ్ నటించడం కష్టమే అంటున్నారు. దీనితో అనేక మంది నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రెండు రోజల క్రితం విజయ్ దేవరకొండ పేరు వినిపించగా, తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. అనేక భాషలలో సినిమాలు కమిటై ఉన్న రానా ఈ ప్రాజెక్ట్ లో నటించగలడా అనే అనుమానం కలుగుతుంది.

సంబంధిత సమాచారం :

More