డేనియల్ శేఖర్ పాత్రకు రానా గట్టిగానే తీసుకున్నాడా?

Published on Sep 25, 2021 12:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఇటీవల విడుదలైన రానా ఫ‌స్ట్ గ్లింప్స్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో రానా డేనియల్ శేఖర్ పాత్రలో నటించేందుకు గట్టిగానే రెన్యూమరేషన్ తీసుకున్నాడని ఫిల్స్ సర్కిల్స్‌లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి రానా 25 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని, అంతేకాకుండా రూ.4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. డేనియ‌ల్ శేఖ‌ర్ పాత్ర కోసం చాలా మందినే సంప్రదించిన చిత్ర యూనిట్ చివరకు రానా అయితే బాగుంటుంద‌ని భావించి ఆయనను ఒకే చేశారట.

సంబంధిత సమాచారం :