రానా మొదలుపెట్టాడు.. ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ రీస్టార్ట్ అయింది

Published on Dec 2, 2020 12:00 am IST

రానా దగ్గుబాటి చేస్తున్న కొత్త సినిమాల్లో ‘విరాటపర్వం’ కూడ ఒకటి. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా, రానా ట్రీట్మెంట్ కోసం వెళ్లడంతో సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు పరిస్థితులన్నీ చక్కబడటంతో సినిమా షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.

90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నారు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ లైన్ వింటేనే సినిమాలో ఒక బలమైన ప్రేమ కథ ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించేసి 2021 ఆరంభంలోనే విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత రానా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశిప’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More