ఇక ఆగలేనంటున్న రానా.. క్రేజీ కాంబినేషన్ మరి

ఇక ఆగలేనంటున్న రానా.. క్రేజీ కాంబినేషన్ మరి

Published on Dec 21, 2020 3:00 PM IST

pavan

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ రానా దగ్గుబాటి వరుస సినిమాల్తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధమవుతుండగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ సినిమా మేకింగ్లో ఉంది. ఈ రెండూ కాకుండా తాజాగా ఆయన మరొక కొత్త సినిమాకు సైన్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ యొక్క ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్. సినిమాలోని రెండవ ప్రధాన పాత్ర కోసం దర్శక నిర్మాతలు మొదటగా రానానే అప్రోచ్ అయ్యారు. మంచి ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో రానా కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ‘ఈరోజు నుండి ఎపిక్ జర్నీ మొదలవుతుంది. ఇప్పటివరకు పలు ఇండస్ట్రీల్లోని స్టార్లతో పనిచేశాను. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఇక ఎదురుచూడలేను’ అంటూ చెప్పుకొచ్చారు రానా. వచ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాలో ఫీమేల్ లీడ్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు