సాహసం డైరక్టర్ తో రానా !

Published on Dec 13, 2018 1:16 am IST


ట్యాలెంటెడ్ డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి మెగా ఫోన్ పట్ట్టుకొని దాదాపుగా రెండు సంవత్సరాల పైనే అవుతుంది. 2016 లో యేలేటి తెరకెక్కించిన ‘మనమంతా’ విడుదలై విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది కానీ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక ఈ చిత్రం తరువాత ఆయన ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. యేలేటి ఇటీవల సాయి ధరమ్ తేజ్ , నాని , నితీన్ లకు స్టోరీ వినిపించిన వారెవ్వరు సినిమా చేయడానికి ముందుకు రాలేదు. తాజాగా రానా , యేలేటి తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ప్రస్తుతం రానా ‘హాతి మేర సాతి’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం ‘అరణ్య’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :