రానా కూడా రెడీ అయిపోతున్నాడుగా !
Published on Jun 1, 2017 10:06 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ల దృష్టంతా టెలివిజన్ రంగం మీద పడింది. టీవీ మాధ్యమానికున్న రీచ్ ను పసిగట్టిన స్టార్ హీరోలంతా టీవీ షోలకు సిద్ధమైపతున్నారు. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో సీనియర్ హీరోలు అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవగా వారి రూట్ నే ఫాలో అవుతున్నారు యువ హీరోలు. అందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో పాపులర్ అయిన బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా మరొక స్టార్ రానా కూడా టీవీ షోకి సిద్దమవుతున్నాడు.

ఈ షో పూర్తిగా సినీ సెలబ్రిటీల గురించే ఉండి, ఆసక్తికరంగా, భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేగాక ఇప్పటికే కి సంబందించిన షూటింగ్ కూడా జరుగుతోందట. ఇంకొద్ది నెలల్లో ఈ షో మొదలవుతుందని అంటున్నారు. ‘ బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించిన రానా హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో పాటు కాన్సెప్ట్ గనుక ప్రేక్షకులకు నచ్చితే ఈ షో పాపులర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 
Like us on Facebook