భాషతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ అన్ని పరిశ్రమలోని మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘హాతి మేరే సాతి’ అనే సినిమా కోసం సిద్దమవుతున్నారు. ఫిబ్రవరి మధ్య నుండి థాయిలాండ్ లో షూటింగ్ మొదలుపెట్టుకోనున్న ఈ చిత్రం కోసం ఇప్పటి నుండే హోమ్ వర్క్ మొదలుపెట్టారాయన.
అందులో భాగంగా సినిమాలో తనతో పాటు నటించనున్న 15 ఏనుగులను మచ్చిక చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం ఒక 15 నుండి 20 రోజుల పాటు వాటితో పాటే అడవుల్లో గడపాలని నిర్ణయించుకున్నారాయన. ఇలా చేయడం వలన షూటింగ్ నాటికి ఏనుగులకు, తనకు మధ్యన మంచి సయోధ్య కుదురుతుందని, అప్పుడు సినిమా బాగా వస్తుందని రానా మీడియాతో అన్నారు.
దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేయనున్నఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఏనుగులల, మనుషులు స్నేహంగా ఉండటం అనే అంశం మీద ఈ సినిమా ఉండనుంది.


