హాలీవుడ్ ఎవెంజర్స్ లో రానా !

నటుడిగా మంచి పేరును తెచ్చుకున్న రానా తన వాయిస్ తో కూడ మెప్పిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు వాయిస్ ఓవర్ చెప్పిన రానా ఇప్పుడు హాలీవుడు ‘ఎవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్స్’ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఈ వాయిస్ ఓవర్ ఉండబోయేది తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు.

చిత్రంలోని ప్రతినాయకుడి పాత్ర అయిన తనోస్ కు రానా డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇలా మార్వెల్ ఎవెంజర్స్ కు డబ్బింగ్ చెప్పడం చాలా బాగుందని, ఇప్పుడు తాను కూడ అందులో భాగమయ్యానని రానా అన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఏప్రిల్ 27న విడుదలకానుంది.