“రణరంగం” ట్రైలర్ ఎప్పుడంటే?

Published on Aug 2, 2019 2:00 am IST

దర్శకుడు సుధీర్ వర్మ శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “రణరంగం”. ఈ నెల 15న స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా విడుదల కానుంది. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శర్వా రెండు విభిన్న గెట్ అప్స్ లో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

ఈనెల 4న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే టీజర్ తో పాటు, సాంగ్స్ విడుదల చేయగా మంచి ఆదరణ దక్కించుకోవడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూర్చుతున్నారు.

సంబంధిత సమాచారం :

More