రానా-తేజ సినిమాకు రంగం సిద్ధం..!

10th, October 2016 - 11:59:04 AM

rana1
తెలుగు సినిమాలో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా వెలుగొందిన తేజ, ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాలో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన రానాల కాంబినేషన్‌లో ఓ సినిమా కొద్దిరోజుల క్రితం అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పక్కాగా పూర్తి చేసిన టీమ్ రేపట్నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతోంది. సురేష్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ పొలిటికల్ డ్రామా అన్న ప్రచారం వినిపిస్తోంది.

బాహుబలి తర్వాత హీరోగా కూడా తన స్థాయికి తగ్గ సినిమాలే చేయాలన్న ఉద్దేశంతో ‘ఘాజీ’ అన్న సినిమాతో పాటే తేజ సినిమాను రానా ఒప్పుకున్నారు. ఇక గత కొన్నాళ్ళుగా ఒక సరైన హిట్ లేక కెరీర్ గ్రాఫ్ పడిపోవడంతో దర్శకుడు తేజ కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారట. రానా సరసన కాజల్ హీరోయిన్‌గా నటించనున్నారు.