రంగస్థలం మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on May 7, 2019 6:09 pm IST

సుకుమార్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ గత ఏడాది విడుదలై రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇక ఈ చిత్రం మలయాళం లో ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేది ఖరారైంది. మే 24న ఈ చిత్రం కేరళ థియేటర్లలో సందడి చేయనుంది. మరి తెలుగులో బ్లాక్ బ్లాస్టర్ అయిన ఈ చిత్రం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More