‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో కూడ విడుదలవుతుందట !

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న భారీ ఎత్తున విడుదలకానుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు చరణ్ స్వయంగా అన్నారు.

ఇటీవలే జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగుతో పాటు తమిళంలో కూడ చేయాలని అనుకున్నాం కానీ బిజీ షెడ్యూల్స్ వలన కుదరలేదు. అందుకే ఏప్రిల్ లేదా మే నెలలో మంచి తేదీ చూసి రిలీజ్ చేస్తాం, అలాగే మలయాళంలో కూడ వేసవి తర్వాత విడుదలచేయాలనుకుంటున్నాం అన్నారు. ఇకపోతే హిందీ హక్కులు కూడ భారీ మొత్తానికి అమ్ముడై ఉండటం వలన చిత్రం అక్కడ కూడ మంచి స్థాయిలోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి.