ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రణ్వీర్ సింగ్.

Published on May 27, 2019 11:01 am IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ వరుసవిజయాలతో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా “గల్లీ బాయ్” గా అలరించిన ఈ స్టార్ హీరో, ఇండియా కి మొదటి వరల్డ్ కప్ అందించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ “83” లో కపిల్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో క్రేజి ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేశాడు ఈ టాలెంటెడ్ హీరో.

నూతన దర్శకుడు దివ్యాన్గ్ టక్కర్ దర్శకత్వంలో వస్తున్నకొత్త మూవీ కి “జయేష్ భాయ్-జోర్దార్” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్నీ రణ్వీర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “83” షూటింగ్ తరువాత ఈ మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More