స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో !

Published on May 9, 2019 2:35 pm IST

ఇటీవల కేసరి తో సూపర్ హిట్ కొట్టాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. మార్చి లో విడుదలైన ఈచిత్రం 200 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత అక్షయ్ కుమార్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్య వన్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో రణవీర్ సింగ్ స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నాడు. ఇంతకుముందు రోహిత్ శెట్టి , రణ్వీర్ తో సింబా చిత్రాన్ని తెరకెక్కించగా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. తమన్ సంగీతం అందిస్తున్న సూర్య వన్షి లో కత్రీనా కైఫ్ ,అక్షయ్ కుమార్ సతీమణి గా నటిస్తుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More