రణ్ వీర్ సింగ్ ’83’కి భారీ ఆఫర్ ?

Published on Jul 14, 2020 7:00 am IST

హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నా కరోనాతో సాధ్యం కాలేదు. కాగా తాజాగా ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చిందట. మేకర్స్ కూడా ఓటిటీలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తోంది.

రణ్వీర్ సింగ్ ఈ మూవీలో కపిల్ దేవ్ గా నటిస్తుండగా కపిల్ భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు ఇందుకూరి, షాజిద్ నడియావాలా, కబీర్ ఖాన్ నిర్మాతలుగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక కపిల్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన విషయాలను మరియు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More