మెగా హీరో కి తండ్రి గా ప్రముఖ నటుడు !

Published on May 10, 2019 11:14 pm IST

వరుస పరాజయాలతో సతమతవుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ కి రిలీఫ్ ఇచ్చింది చిత్రలహరి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది అయితే తేజు కెరీర్ కు పెద్దగా బూస్ట్ ఇవ్వలేకపోయింది. ఇకఈచిత్రం తరువాత సాయి ధరమ్, మారుతితో సినిమా చేయనున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది.

ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు రావు రమేష్, హీరో కి తండ్రి పాత్రలో నటించనున్నాడట. అలాగే ఈ చిత్రానికి హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :

More