‘బన్నీ’ సినిమా నుండి తప్పుకున్న ప్రముఖ నటుడు !

Published on Jul 30, 2019 3:37 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్’ 19వ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి డేట్స్‌ సర్దుబాటు చెయ్యలేక ప్రముఖ నటుడు రావు రమేష్ తప్పుకున్నారట. షూటింగ్ ఆలస్యం కావటంతో రావు రమేష్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారని… ఈ సినిమా షూటింగ్ డేట్స్ లోనే వేరే పెద్ద సినిమాకి ఎప్పుడో డేట్స్ కేటాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రావు రమేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :