“#RAPO19” నుండి ఆది పినిశెట్టి సరికొత్త పోస్టర్ విడుదల

“#RAPO19” నుండి ఆది పినిశెట్టి సరికొత్త పోస్టర్ విడుదల

Published on Dec 14, 2021 1:50 PM IST

రామ్ పొతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం #RAPO19. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం లో కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే నేడు ఆది పినిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

గెడ్డం తో, రఫ్ లుక్ తో కనిపిస్తున్న ఆది పినిశెట్టి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన ఈ పోస్టర్ తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిత్తూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు