రష్మిక అదృష్టం మాములుగా లేదు

Published on Aug 2, 2019 12:50 pm IST

కన్నడ చిత్రాల ద్వారా వెండి తెరకు పరిచయమైన రష్మిక మందాన వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ మంచి ఊపుమీదున్నారు. నాగ శౌర్య హీరోగా వచ్చిన “ఛలో” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఆ తదుపరి చిత్రంగా విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన “గీతగోవిందం” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తదుపరి చిత్రం నాని సరసన “దేవదాసు” చిత్రంలో నటించగా ఆ చిత్రం కూడా డీసెంట్ టాక్ సొంత చేసుకొని పర్వాలేదనిపించింది. ఇక తాజాగా మరో మారు విజయ్ తో చేసిన “డియర్ కామ్రేడ్” డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళుతోంది.

అటు కన్నడ లో చూసినా,ఇటు తెలుగులో చూసినా ఆమె చేసిన చిత్రాలు దాదాపు విజయం సాధించడం జరిగింది. దీనితో రష్మికకు పరిశ్రమలో లక్కీ గర్ల్ అనే సెంటిమెంట్ స్థిరపడిపోయింది. టాలెంట్ కి మించి సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉండే చిత్ర పరిశ్రమలో అవి రెండు ఉన్న రష్మిక దూసుకుపోతుంది. ఇప్పటికే స్టార్ హీరో మహేష్ సరసన “సరిలేరు నీకెవ్వరూ” చిత్రంలో నటిస్తున్న రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రానున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

వీటితో పాటు యంగ్ హీరో నితిన్ కి జోడీగా “భీష్మ” చిత్రంతో పాటు,తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మిక నటిస్తున్నారు. అలాగే స్టార్ హీరో తలపతి విజయ్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా రష్మిక పేరు పరిశీలనలో ఉందని సమాచారం. రష్మిక ఊపు చూస్తుంటే టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే నెంబర్ వన్ పొజిషన్ కి చేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :