రాశీఖన్నాకి మరో బంపర్ ఆఫర్ !

Published on Aug 2, 2021 9:00 am IST

హీరోయిన్ రాశీఖన్నాకి కోలీవుడ్‌ లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాశీఖన్నా ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాదాపు ఈ సినిమా షూటింగ్స్‌ ను కూడా రాశీఖన్నా పూర్తి చేసిందట. అయితే, తాజాగా రాశీఖన్నాకి మరో బంఫర్ ఆఫర్ తగిలింది. కార్తీ ‘సర్దార్‌’ సినిమాలో కూడా రాశీఖన్నా హీరోయిన్‌ గా నటించబోతుంది.

అలాగే ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌ గా రాశీఖన్నాని సంప్రదించారని తెలుస్తోంది. మొత్తానికి తమిళంలో రాశీఖన్నాకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాలో, అలాగే గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (వర్కింగ్‌ టైటిల్‌), అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ ల్లో రాశీఖన్నా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :