రాశి ఖన్నా,విజయ్ ల మూవీ షూటింగ్ కంప్లీట్.

Published on Aug 2, 2019 11:32 am IST

హీరోయిన్ రాశీ ఖన్నా విశాల్ హీరోగా ఇటీవల విడుదలైన తమిళ చిత్రం “అయోగ్య” తో హిట్ అందుకున్నారు. కాగా తమిళంలో నాల్గవ చిత్రంగా “సంగ తమీజన్” అనే చిత్రంలో నటిస్తున్నారు. విలక్షణ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ పార్ట్ ని చిత్ర యూనిట్ నిన్న పూర్తీ చేశారు. ఈ సందర్భంగా నటి రాశి ఖన్నా “సంగ తమిజన్” చిత్రం షూటింగ్ పూర్తయింది, నా ఫేవరేట్ హీరో విజయ్ సేతుపతి గారితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. అలాగే ఆ సందర్భంలో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదటిసారి విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మీనన్ ద్వయం సంగీతం అందిస్తుండగా అక్టోబర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :