రష్మి ‘అంతకు మించి’ రాబోతుంది !

రష్మి ‘అంతకు మించి’ రాబోతుంది !

Published on Aug 5, 2018 1:30 PM IST

An

జై, రష్మి గౌతమ్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న చిత్రం ‘అంతకు మించి’. ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని శనివారం ‘ఆర్ ఎక్స్ 100′ దర్శకుడు అజయ్ భూపతిచే అనౌన్స్ చేయించారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. ”అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతకుమించి సినిమాలో అదే కనపడుతోంది. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది, అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నానన్నారు.

దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ”మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. మ్యూజిక్, కెమెరా పనితనం బాగుంటుంది. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో జై మాట్లాడుతూ.. ”సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. రష్మీగారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది” అని అన్నారు.

హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ”అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జి కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు