అందుకే ఎక్కువ రెమ్యూనేషన్, తీసుకుంటున్నానన్న స్టార్ హీరోయిన్

Published on Jul 17, 2019 1:26 pm IST

రష్మిక మందాన టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. చలో,గీత గోవిందం వంటి విజయాలు ఆమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఏకంగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో లీడ్ హీరోయిన్ అవకాశం పట్టేసిన ఈ భామ, హీరో నితిన్ సరసన “భీష్మ” చిత్రంలో కూడా చేస్తున్నారు. అలాగే తలపతి విజయ్ 64వ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఈమె పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐతే రష్మిక క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమెకు రెమ్యూనరేషన్ ఇవ్వాలంటే నిర్మాతలకు చుక్కలు కనబడుతున్నాయట. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక స్పందించారు. నేను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నాకష్టం కి తగ్గట్టుగా తీసుకుంటున్నాను, అంతే కానీ,ఎక్కువగా ఏమి తీసుకోవడం లేదన్నట్లుగా చెప్పడం జరిగింది. అంటే ఆమె అడిగే మొత్తం ఎంతైనా కానీ అది ఆమె చేస్తున్న పనికి సమానంగా ఫీలవుతున్నారామె. అంతే లెండి క్రేజ్ ఉన్నప్పుడే ఓ రూపాయి వెనకేసుకోవాలి, లేదంటే తర్వాత బాదపడాల్సివస్తుంది. ఈ సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నట్లుంది రష్మిక.

సంబంధిత సమాచారం :

X
More