అప్పుడే పది చేశానా అంటూ ఆశ్చర్యపోతున్న మహేష్ హీరోయిన్

Published on Feb 17, 2020 11:34 am IST

రష్మిక మందాన హీరోయిన్ గా అప్పుడే పది సినిమాలు చేశానా అని ఆశ్చర్యపోతుంది. ఈనెల 21న ఆమె నటించిన భీష్మ చిత్రం విడుదల అవుతుండగా ఆమెకి అది పదవ చిత్రం. 2016లో కిరాక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో చిత్రంతో పరిచయమైంది. ఆమె విజయ్ దేవరకొండ హీరోగా చేసిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన నటించిన రష్మిక మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కన్నడలో పొగరు అనే చిత్రం చేస్తున్న రష్మిక, తమిళంలో కార్తీ సరసన సుల్తాన్ చిత్రంలో నటిస్తుంది. ఇక తెలుగులో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అల్లు అర్జున్ భారీ చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా అన్ని పరిశ్రమలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ రష్మిక దూసుకుపోతుంది.

సంబంధిత సమాచారం :