రష్మిక క్రేజ్ మాములుగా లేదుగా !

Published on Oct 25, 2020 8:04 pm IST

రష్మిక మందన్న ‘ఛలో, గీతాగోవిందం’ సినిమాలతో తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత చేసిన ‘భీష్మ’ కూడ మంచి హిట్టవ్వడంతో ఆమెను లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. దీనికితోడు ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఇది జరుగుతుండగానే ఆమెకు ఇంకో రెండు మంచి ఆఫర్లు వచ్చాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆ రెండు ఆఫర్స్ లో ఒకటి తమిళ హీరో సూర్య హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రానున్న సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ హీరోలు, మీడియమ్ రేంజ్ హీరోలు కొత్త సినిమా అనుకుంటున్నారు అనగానే ముందుగా కథానాయికల లిస్టులో రష్మిక మందన్న పేరు చేరిపోతోంది. మరి ‘పుష్ప’ కూడ హిట్టైతే ఇక రష్మిక స్థాయి ఇంకా పెరిగిపోతుంది. మొత్తానికి రష్మిక క్రేజ్ మాములుగా లేదుగా.

సంబంధిత సమాచారం :

More